యూఎస్ లో “టిల్లు స్క్వేర్” రికార్డ్ మైల్ స్టోన్

యూఎస్ లో “టిల్లు స్క్వేర్” రికార్డ్ మైల్ స్టోన్

Published on Mar 31, 2024 1:04 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నేహా శెట్టి క్యామియో రోల్ లో నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “టిల్లు స్క్వేర్”. మరి మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించి రెండు రోజుల్లో ఊహించని నంబర్స్ ని సెట్ చేసి లాభాలు దిశగా వెళ్తుంది. అయితే లేటెస్ట్ గా యూఎస్ వసూళ్ల సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ అప్డేట్ అందించారు.

దీంతో ఈ చిత్రం నార్త్ అమెరికాలో జస్ట్ ఈ రెండు రోజుల్లోనే ఏకంగా 1.5 మిలియన్ డాలర్స్ రాబట్టేసి రికార్డు మైల్ స్టోన్ ని టచ్ చేసేసింది. ఇక నెక్స్ట్ స్టాప్ గా అయితే 2 మిలియన్ డాలర్స్ దిశగా ఈ చిత్రం దూసుకెళ్తుంది అని చెప్పాలి. మొత్తానికి అయితే ఓవర్సీస్ మార్కెట్ లో టిల్లు స్క్వేర్ మ్యానియా మాములుగా లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రామ్ మిర్యాల, అచ్చు సాంగ్స్ అందించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు