శ్రీ రాములు థియేటర్లో రేపు “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రిలీజ్!

శ్రీ రాములు థియేటర్లో రేపు “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రిలీజ్!

Published on Feb 13, 2024 3:36 PM IST


స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్. ఈ చిత్రం డీజే టిల్లు కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి సంబందించిన ట్రైలర్ కట్ తో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ ను వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కి సంబందించిన మరొక అప్డేట్ ను మేకర్స్ ఆడించారు. రేపు హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్లో ట్రైలర్ ను సాయంత్రం 5:04 గంటలకి ప్రదర్శించనున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. మార్చ్ 29 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు