‘డీజే టిల్లు’ కి మించి ‘టిల్లు స్క్వేర్’ మిమ్మల్ని మరింతగా అలరిస్తుంది – డైరెక్టర్ మల్లిక్ రామ్

‘డీజే టిల్లు’ కి మించి ‘టిల్లు స్క్వేర్’ మిమ్మల్ని మరింతగా అలరిస్తుంది – డైరెక్టర్ మల్లిక్ రామ్

Published on Mar 28, 2024 1:01 AM IST

సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ మూవీ టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిగి భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ మార్చి 29న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ ఐటిసి కోహినూర్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ మల్లిక్ రామ్ మాట్లాడుతూ, గత రెండేళ్లుగా డీజే టిల్లు పాటలను, మాటలను మీ జీవితంలో ఒక భాగం చేశారు.

ఇప్పుడు టిల్లు స్క్వేర్ చిత్రాన్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మార్చి 29న థియేటర్లకు వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. సిద్ధుతో ఈ రెండేళ్ల ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతఙ్ఞతలు. డీజే టిల్లు మిమ్మల్ని ఎంతలా అలరించిందో టిల్లు స్క్వేర్ మిమ్మల్ని అంతకుమించి అలరిస్తుందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు