అవైటెడ్ “పుష్ప” రాజ్ ట్రీట్ కి టైం ఫిక్స్.!

Published on Apr 3, 2021 12:02 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానాలు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఇప్పుడు ఎట్టకేలకు రానే వచ్చింది. ఈ ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు కావడంతో తాను నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” అప్డేట్ కోసం వారంతా ఎదురు చూసారు. మరి దీనికి సంబంధించి ఓ అదిరే వీడియో క్లిప్ తో రివీల్ చేసారు.

తలకి ముసుగు చుట్టి చేతులు వెనకకి కట్టేసి ఉన్న వ్యక్తి అడవుల్లోకి పారిపోతున్న వీడియోతో ఒక్కసారిగా సుకుమార్ అండ్ టీం పుష్ప పై మంచి అంచనాలు రేకెత్తించారు. మరి దీనితోనే వచ్చే వచ్చే ఏప్రిల్ 7న సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు తమ ఫిరోషియస్ పుష్ప రాజ్ ను ప్రతీ ఒక్కరూ మీట్ అవుతారని కన్ఫర్మ్ చేసేసారు.

మరి ఇది టీజర్ కోసమా లేక జస్ట్ గ్లింప్స్ కోసమా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి మాత్రం మేకర్స్ సాలిడ్ ట్రీట్ ను టైం ఫిక్స్ చేసేసారు. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :