“వకీల్ సాబ్” ట్రైలర్ యుఫోరియాకు టైం లాక్.!

Published on Mar 28, 2021 12:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. చాలా ఏళ్ళు తర్వాత పవన్ నుంచి వస్తున్న కం బ్యాక్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు సెట్టయ్యాయి. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా భారీ మార్పులు చేసి విడుదలకు రెడీ చేశారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా ఉన్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చెయ్యగా దీని కోసం గట్టిగా అభిమానులు ఎదురు చూడడం స్టార్ట్ చేసారు. మరి ఈ మార్చ్ 29న విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ వచ్చే టైం ను లాక్ చేసేసారు.

పవర్ యుఫోరియా ట్రైలర్ ను నిర్మాత దిల్ రాజు యూట్యూబ్ ఛానెల్లో ఎక్స్ క్లూజివ్ గా రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటన ఇచ్చేసారు. మరి ఈ ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మరోపక్క నివేతా థామస్ మరియు అంజలి, అనన్య నాగళ్ళలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏప్రిల్ 9న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :