“జైలర్” వరల్డ్ ప్రీమియర్ కి టైం ఫిక్స్..!

“జైలర్” వరల్డ్ ప్రీమియర్ కి టైం ఫిక్స్..!

Published on Oct 29, 2023 4:00 PM IST

తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మోహన్ లాల్ మరియు శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ నటులు సాలిడ్ గెస్ట్ రోల్స్ లో నటించిన భారీ హిట్ చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించగా రజినీకాంత్ మళ్ళీ తన రేంజ్ హిట్ ని అయితే కొట్టి అదరగొట్టారు. మరి ఈ చిత్రం తెలుగులో కూడా రజినీకాంత్ కెరీర్ లోనే ఓ మాసివ్ గ్రాసర్ గా నిలవగా ఈ చిత్రం ఇపుడు అయితే టెలివిజన్ స్క్రీన్ పై టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

మరి ఈ సినిమా తెలుగు సహా తమిళ్ టెలికాస్ట్ హక్కులు నిర్మాణ సంస్థ సన్ టీవీ వారి దగ్గరే ఉండగా తెలుగులో జెమినీ తమిళ్ లో సన్ టీవీ లో అయితే ఈ చిత్రం టెలికాస్ట్ కానుంది. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ఈ దీపావళి కానుకగా టెలికాస్ట్ కి తీసుకురాబోతున్నట్టుగా లేటెస్ట్ గా జెమినీ టీవీ వారు కన్ఫర్మ్ చేశారు. అలాగే తమిళ్ లో కూడా ఈ టైం కే రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక డేట్ ఒక్కటి ఫైనల్ కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు