మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మంచి బజ్‌తో సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు మంచి క్రేజ్ దక్కింది. ఈ క్రమంలో ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
కాగా, ఈ ట్రైలర్‌ను తిరుపతిలో జరగబోయే ఓ ఈవెంట్లో లాంచ్ చేయనున్నారు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ ట్రైలర్‌ను జనవరి 4న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ సాలిడ్ పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు. వింటేజ్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో మెగాస్టార్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఈ ట్రైలర్ పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
దీంతో ఈ మూవీ ట్రైలర్ ఎలాంటి మాసివ్ రెస్పాన్స్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.
