నాని “సరిపోదా శనివారం” నుండి బిగ్ అప్డేట్ కి టైమ్ ఫిక్స్!

నాని “సరిపోదా శనివారం” నుండి బిగ్ అప్డేట్ కి టైమ్ ఫిక్స్!

Published on Feb 21, 2024 6:41 PM IST

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రోజు మేకర్స్ సినిమాకి సంబందించిన ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ ను చేయడం జరిగింది. ఈ శనివారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా బిగ్ అప్డేట్ ను ఇవనున్నారు. ఆసక్తికరమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు. నీడలు మాస్ హిస్టీరియాను దాచలేవు. అతన్ని చూడాలనుకుంటున్నారా? ఈ శనివారం ఉదయం 11:59 గంటలకు సిద్ధంగా ఉండండి అని పేర్కొన్నారు.

మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. నాని చాలా కాలం తర్వాత యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తుండటం తో సినిమాపై అభిమానులలో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డివివి దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ మూవీలో తమిళ నటుడు, డైరెక్టర్ SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు