టీజర్ లాంచ్ టైమ్ ఫిక్స్ చేసుకున్న ‘ఓ సుకుమారి’

టీజర్ లాంచ్ టైమ్ ఫిక్స్ చేసుకున్న ‘ఓ సుకుమారి’

Published on Jun 12, 2026 10:00 PM IST

టాలెంటెడ్ నటుడు తిరువీర్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు మ్యాంగో మాస్ మీడియా బ్యానర్లపై మహేశ్వర రెడ్డి మూలి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను జూన్ 13న ఉదయం 9 గంటల నుండి హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో నిర్వహించబోతున్నారు. చిత్ర యూనిట్ సమక్షంలో ఎంతో వైభవంగా జరగబోయే ఈ కార్యక్రమంతో సినిమా ప్రమోషన్స్ జోరు అందుకోనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఐశ్వర్య రాజేష్ పల్లెటూరి పిల్ల లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్న ఈ విభిన్నమైన యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులకు ఒక మంచి వినోదాన్ని పంచబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ టీజర్ సినిమాపై ఎలాంటి అంచనాలను పెంచుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు