మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ మే 28 మధ్యాహ్నం 03:06 గంటలకు ‘పెద్ది’ చిత్ర పూర్తి ఆడియో జూక్‌బాక్స్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల భోపాల్‌లో జరిగిన మ్యూజికల్ కాన్సెర్ట్‌లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అండ్ టీమ్ లైవ్‌గా పర్ఫార్మ్ చేసిన ‘మస్సా మస్సా’ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్నుంచే ఈ పాట కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ స్పెషల్ ట్రాక్‌ను కూడా రేపు విడుదల చేయబోయే జూక్‌బాక్స్‌తో పాటే మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.


