వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబో మూవీ.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి

వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబో మూవీ.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి

Published on Jun 17, 2026 4:58 PM IST

విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తుండటంతో వెంకీ-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కథతో రాబోతున్నారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ ప్రెస్టీజియస్ సినిమాను అధికారికంగా పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ యొక్క గ్రాండ్ పూజా కార్యక్రమం రేపు(జూన్ 18న) ఉదయం 9 గంటల నుండి ఘనంగా జరగనుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు.

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో గతంలో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పండగను సృష్టించగా.. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా తోడవడంతో ఈ సంక్రాంతి ఎంటర్‌టైనర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ భారీ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్టార్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రేపటి పూజా కార్యక్రమంతో ఈ క్రేజీ మూవీ షూటింగ్ జర్నీ మొదలుకానుండగా, రేపు రాబోయే అప్‌డేట్స్ కోసం ఇటు నందమూరి, అటు దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు