రెండో ప్రాజెక్ట్ కి టైం లాక్ చేసుకున్న “రాజ రాజ చోర” కాంబినేషన్

రెండో ప్రాజెక్ట్ కి టైం లాక్ చేసుకున్న “రాజ రాజ చోర” కాంబినేషన్

Published on Feb 28, 2024 12:49 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో శ్రీవిష్ణు కూడా ఒకడు. మరి తన చిత్రాల్లో ఏదొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో అలరించే ప్రయత్నం చేసే తాను రీసెంట్ గా ఇచ్చిన సాలిడ్ ఎంటర్టైనర్ హిట్స్ లో దర్శకుడు హషిత్ గోలి తో చేసిన రాబరీ డ్రామా “రాజ రాజ చోర” కూడా ఒకటి.

మరి ఈ కాంబినేషన్ పై ఇప్పుడు మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేశారు. తమ కాంబినేషన్ లో రెండో చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ దీనిపై రేపు ఫిబ్రవరి 29న ఉదయం 11 గంటల 45 నిమిషాలకి సినిమా టైటిల్ ని రివీల్ చేస్తున్నట్టుగా ఇంట్రెస్టింగ్ వింటేజ్ పోస్టర్ తో తెలిపారు.

అయితే వీరి కాంబినేషన్ నుంచి రాజ రాజ చోర నేపథ్యంలోనే ప్రీక్వెల్ ఉంటుంది అని టాక్ ఉంది. మరి మేకర్స్ ఎలాంటి టైటిల్ ని రివీల్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో నటీనటులు ఎవరు కనిపిస్తారు అనేవి కూడా రేపే రివీల్ అవుతాయేమో చూడాలి. మరి ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు