తమన్నా “ఓదెల 2” టీజర్ కి టైం ఫిక్స్!

తమన్నా “ఓదెల 2” టీజర్ కి టైం ఫిక్స్!

Published on Feb 21, 2025 9:20 PM IST

టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన సంపత్ నంది తెరకెక్కించిన చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన “రచ్చ” కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నాతో ఇపుడు సోలోగా ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ని అయితే చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రమే “ఓదెల 2”. మరి ఈ సినిమాలో తమన్నా ఒక అఘోరి పాత్రలో కనిపిస్తుండగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ని మహా కుంభమేళాలో విడుదల చేస్తున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు.

అయితే ఇపుడు దీనికి టైం లాక్ అయ్యింది. కుంభమేళా లోనే ఒక 102 ఏళ్ల నాగ సాధుతో ఈ టీజర్ ని మేకర్స్ ఈ ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల 25 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా లాక్ చేశారు. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా మధు క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే త్వరలోనే నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు