సరికొత్తగా ‘తిప్పరా మీసం’ ట్రైలర్.

సరికొత్తగా ‘తిప్పరా మీసం’ ట్రైలర్.

Published on Nov 6, 2019 1:51 PM IST

భిన్నమైన కథలను ఎంచుకుంటూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో శ్రీవిష్ణు.ఆయన హీరోగా చేసిన బ్రోచేవారెవరురా మూవీ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఇక ఆయన నటించిన తాజా చిత్రం తిప్పరా మీసం ఈనెల 8న విడుదల కానుంది. దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా రిజ్వాన్ నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన హీరోయిన్ గా నిక్కీ తంబోలి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి అందిస్తున్నారు. మదర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సీనియర్ నటి రోహిణి శ్రీవిష్ణు తల్లి పాత్ర చేశారు.

కాగా నేడు ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ‘నా గతాన్ని…,నా సమస్యను గుర్తించని ఈ పనికిమాలిన సమాజం నేను చేసింది తప్పు అని ఒక ముద్ర వేసింది…, అని శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. తనకు ఇష్టం వచ్చిన విచ్చలవిడి జీవితం గడిపే ఒక నైట్ క్లబ్ డీజే కి, తన తల్లికి మధ్య నడిచే ఎమోషనల్ వార్ లా ఈ చిత్రం అనిపిస్తుంది. శ్రీవిష్ణు రా అండ్ మాస్ లుక్ లో కేకగా ఉన్నాడు. ఏమైనా తిప్పరా మీసం ట్రైలర్ కొత్తగా అలరించేదిగా ఉంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు