విలక్షణ చిత్రాలను ఎంచుకుంటూ తన స్థాయి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు హీరో శ్రీవిష్ణు. ఈ మధ్య ప్రియదర్శి, రాహుల్ లతో కలిసి చేసిన కామెడీ క్రైమ్ డ్రామా బ్రోచేవారెవరురా మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ నుండి అభినందనలు అందుకున్న ఆ చిత్రం కమర్షియల్ గా కూడా సక్సెస్ ఐయ్యింది. కాగా శ్రీవిష్ణు తాజాగా నటించిన చిత్రం తిప్పరా మీసం విడుదల తేదీ ఖరారైంది.
వచ్చే నెల 8న తిప్పరా మీసం చిత్రం విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. బాగా పెరిగిన జులపాలతో శ్రీవిష్ణు మాస్ అవతారంలో కనిపిస్తుండగా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి ఆదరణ లభించింది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ విజయ్ ఎల్ తెరకెక్కిస్తున్నారు.


