తిప్పరామీసం ఫస్ట్ లుక్ విడుదల !

Published on Feb 6, 2019 10:26 am IST

‘నీది నాదీ ఒకే కథ’ ఫేమ్ శ్రీ విష్ణు నటిస్తున్న ‘తిప్పరామీసం’ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదలైయింది. పోస్టర్ లో శ్రీ విష్ణు లుక్ డిఫ్రెంట్ గా వుంది. ఇక టైటిల్ లోగో కూడా చాలా బాగుంది. ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు కు జోడిగా చెన్నై మోడల్ నిక్కీ తంబోలిని నటిస్తుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ మరియు శ్రీ ఓం సినిమా బ్యానర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.

ఇక శ్రీవిష్ణు ఆ చిత్రంతో పాటు ‘బ్రోచేవారెవరురా’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నివేత థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ గా రూపొందుతున్న ఈ చిత్రం కూడా ఈఏడాదిలోనే విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :