ప్రస్తుతం దక్షిణాది సినిమా లవర్స్ మంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు సీక్వెల్ చిత్రాల్లో కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న చిత్రం ఖైదీ 2(Khaithi 2) అనే చెప్పాలి. కానీ ఈ చిత్రం రిలీజ్ పక్కన పెడితే అసలు స్టార్ట్ అవుతుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
కానీ ఇపుడు ఊహించని సర్ప్రైజ్ ట్విస్ట్ వైరల్ గా మారుతుంది. సెన్సార్ కి వెళ్లిన ఒక టీజర్ కట్ చర్చకి దారి తీసింది. ‘డిల్లీ’ పేరిట ఈ టీజర్ ని ఖైదీ నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ వారు దీనిని పంపినట్టు తెలుస్తుంది. పైగా ఇందులో కార్తీ పాత్ర పేరు ఉండడంతో ఇది ఖైదీ సీక్వెల్ టీజర్ నే అని చాలా మంది భావిస్తున్నారు.
మరి ఇది నిజం అయితే మాత్రం అభిమానులకి ఒక షాకింగ్ సర్ప్రైజ్ అనే అనుకోవాలి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఒకవేళ నిజం అయితే ఈ టీజర్ ఎప్పుడు వస్తుంది అనేవి చూడాలి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ మధ్యలో ఖైదీ 2 కోసం ఇలాంటి టర్న్ రావడం అనేది సర్ప్రైజింగ్ టేక్ తీసుకుంది.


