ఇటీవలే ‘జాతిరత్నాలు’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. డిమాండ్ ఉన్న చిన్న హీరోల్లో ఇతనూ ఒకరు. ఈయన తన తర్వాతి సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో చేయనున్నాడు. ‘జాతిరత్నాలు’ కంటే ముందే ఈ సినిమా ఫైనల్ అయింది. ఇందులో స్టార్ కథానాయకి అనుష్క కథానాయకిగా నటిస్తోంది. సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాను మహేష్ డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. ప్రస్తుతం అనుష్క బరువు తగ్గే పనిలో ఉంది. ఒక్కసారి స్లిమ్ లుక్ తెచ్చుకోగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందట. ఈ ప్రాజెక్ట్ మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. నవీన్, అనుష్కలది కొత్త కాంబినేషన్ కాబట్టి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలని అనుకుంటున్నారు చాలామంది.
