గోపిచంద్ సినిమాకు కిర్రాక్ టైటిల్

గోపిచంద్ సినిమాకు కిర్రాక్ టైటిల్

Published on Dec 25, 2019 11:00 PM IST

Gopichand2

మ్యాచో మాన్ గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం కిర్రాక్ అనేలా టైటిల్ సిద్దం చేశారు టీమ్. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘సీటీమార్’ అనే పేరును అనుకుంటున్నారట.

చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండటం, మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో చిత్రానికి ఈ టైటిల్ బాగా యాప్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను ‘యు టర్న్’ నిర్మాత శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయకిగా నటిస్తోంది.
గతంలో ‘గౌతమ్ నంద’ సినిమాతో పర్వాలేదనిపించుకున్న గోపిచంద్, సంపత్ నందిలు ఈసారి ఎలాంటి సినిమాను ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు