పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’కే ఫిక్స్ అట !

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’కే ఫిక్స్ అట !

Published on Feb 6, 2020 12:46 PM IST

పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ తెలుగు రీమేక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే అనేక పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్చేశాయి. అయితే తాజాగా చిత్రబృందం ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ టైటిలే ఫిక్స్ అయ్యేలా ఉంది. ఇదే టైటిల్ ను ఉగాది రోజున రివీల్ చేయనున్నారు.

ఇక ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు. ఈ తేదీ వెనుక ఒక సెంటిమెంట్ ఉంది. అదే ‘గబ్బర్ సింగ్’. ఈ చిత్రాన్ని అంతా పవన్ కమ్ బ్యాక్ మూవీ అంటుంటారు. ఇది మే 11న విడుదలై ఇండస్ట్రీ హిట్ అయింది. అందుకే దిల్ రాజు పవన్ రీఎంట్రీ చిత్రాన్ని కూడా అదే నెలలో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మే 15ను విడుదల తేదీగా నిర్ణయించారట.

ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తిన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హరీష శంకర్ దర్శకత్వంలో కూడా ఇంకో కొత్త సినిమాకుచేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు