ప్రస్తుతం గ్లోబల్ ఆడియెన్స్ నే మన తెలుగు సినిమా అలాగే భారతీయ సినిమా వైపు మరోసారి తిరిగి చూసేలా చేసిన చిత్రమే “వారణాసి”. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో అనౌన్స్ చేసిన ఈ సినిమా గ్రాండ్ ఎలిమెంట్స్ తో గ్లోబల్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసే విధంగా ఇండియన్ సినిమా నుంచి రెండో ఐమ్యాక్స్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకి అనుకున్నట్టు గానే వారణాసి టైటిల్ తో సమస్యలు మొదలయ్యాయి.
ఈ సినిమా టైటిల్ అనౌన్స్ కాక ముందే మరో చిత్రానికి వారణాసి అంటూ సినిమా ఒకటి అనౌన్స్ అయ్యింది. దీనితో అది రాజమౌళి, మహేష్ ల సినిమాకి మరో టైటిల్ పెడతారా లేక మహేష్ ఖలేజా తరహాలో మహేష్ వారణాసి అనో లేక ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి అని మారుస్తారో అనే టాక్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో జక్కన్న యూనిట్ వారణాసి టైటిల్ ముందు రిజిస్టర్ చేయలేదనే కంప్లైంట్ బయటకి వచ్చింది. సో ఈ భారీ సినిమాకి డెఫినెట్ గా ఆ రెండిట్లో ఏదోకటి ఫైనల్ కావచ్చు.
