హిందీలో ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ కొత్త రికార్డు !

హిందీలో ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ కొత్త రికార్డు !

Published on Nov 9, 2018 1:19 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ నిన్న విడుదలై డివైడ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈ చిత్ర హిందీ వెర్షన్ మొదటి రోజు 50కోట్ల వసూళ్లను రాబట్టి కొత్త రికార్డును సృష్టించింది. బాలీవుడ్ లో ఇప్పటివరకు విడుదలైన హిందీ సినిమాల్లో ఇదే బెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం.

ఇక తెలుగు , తమిళ భాషల్లో కూడా విడుదలైన ఈ చిత్రం పూర్తి నెగెటివ్ టాక్ ను తెచ్చుకొని కేవలం 1.50 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , కరీనా కపూర్ , సన ఫాతిమా షేక్ ముఖ్య పాత్రల్లో నటించారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు