టాక్..టాలీవుడ్ భారీ నిర్మాణ సంస్ఠలో “దళపతి 69”?

టాక్..టాలీవుడ్ భారీ నిర్మాణ సంస్ఠలో “దళపతి 69”?

Published on Jan 23, 2024 8:01 AM IST


ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభుతో తన కెరీర్ లో 68వ చిత్రం “గోట్”(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా ఈ చిత్రం తర్వాత విజయ్ నెక్స్ట్ సినిమాపై ఓ క్రేజీ బజ్ అయితే వైరల్ గా మారుతుంది. మరి దీనితో దళపతి 69 సినిమాని మన టాలీవుడ్ కి చెందిన భారీ నిర్మాణ సంస్థ టేకప్ చేయనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది.

మరి ఆ సంస్థ గ్లోబల్ సెన్సేషన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించనున్నట్టుగా కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఇప్పుడు వరకు విజయ్ 68 తో తన సినిమానే చివరి సినిమా అంటూ అప్పట్లో టాక్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చిత్రం అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇవి వాస్తవం కాదని కూడా టాక్. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు