సినిమాపై ఇష్టం.. అందుకే అంత కష్టం

సినిమాపై ఇష్టం.. అందుకే అంత కష్టం

Published on Sep 13, 2015 2:10 PM IST

prabhas-ram-charan-allu-arj

తెలుగు సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అనగానే వెంటనే హీరోలు డూప్ లకోసం ఎదురుచూసే ప్రక్రియకు నేటి తరం హీరోలు స్వస్తిపలికారు. అభిమానుల దృష్టిలో తామే హీరోలని నిరువుపించడానికి ఎంతటి కష్టమైనా పడుతున్నారు. డూప్ ల అవసరం లేకుండా చెయ్యడానికి మన యువతారలు సిద్ధపడడం అభినందనీయమైన అంశం.

కేవలం ప్రభాస్ పై యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించడానికే 200రోజుల పైన శ్రమించారట. మరి అటువంటి సినిమా కోసమే ఏకంగా ఆరు నెలలు కండలను పెంచడంలో నిమగ్నమైపోయాడు. మగధీరుడు రామ్ చరణ్ ప్రస్తుతం తెరకెక్కుతున్న బ్రూస్ లీ కోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందడం విశేషం. స్టైలిష్ స్టార్ బన్నీ రుద్రమదేవి గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు.

డూప్ లు మాకు సైతం అవసరం లేదని చిన్న హీరోలు సైతం నిరువుపించుకుంటున్నారు . డైనమైట్ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు వున్నందున ప్రత్యేకంగా వీటిపై విష్ణు శిక్షణ పొందిన సంగతి తెలిసినదే . ఇక నన్చాక్ పట్టుకుని దేవదాస్, పండగ చేస్కో లో కొత్త రకం ఫైట్ లను చూపించిన రామ్ దాని వెనుక 3 నెలల శ్రమ వుందని తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు