మేము సైతం : తెలుగు హీరోల చారిటీ క్రికెట్ మ్యాచ్

cricket
హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం నవంబర్ 30న తెలుగు చిత్ర పరిశ్రమ ‘మేము సైతం’ – వుయ్ లవ్ వైజాగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ నైట్ ఈవెంట్ తర్వాత తెలుగు హీరోలు అందరూ కలసి మరో సహాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీమిత్రా గ్రూప్, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 7న విజయవాడలో హీరోలు చారిటీ క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చిన డబ్బులను ఏపి సియం రిలీఫ్ ఫండ్ కు అందజేయనున్నారు. ఈ మ్యాచ్ వివరాలను తెలియజేయడానికి సోమవారం సాయంత్రం హైదరబాద్‌ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అల్లరి నరేష్, తరుణ్, నిఖిల్, నవీన్‌చంద్ర, ప్రిన్స్, తనీష్, శ్రీమిత్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.

హుధూద్ బాధితులకు సహాయార్ధం నిర్వహిస్తున్న మా ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని, తెలుగు సినిమా అభిమానులు అండగా నిలవాలని హీరోలు కోరారు. డిసెంబర్ 7న హీరోలు తమ షూటింగ్ లను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

Exit mobile version