సమ్మర్ ను క్యాష్ చేసుకోలేక పోయిన టాలీవుడ్!

సమ్మర్ ను క్యాష్ చేసుకోలేక పోయిన టాలీవుడ్!

Published on May 15, 2024 12:07 PM IST

సమ్మర్ అంటే తెలుగు సినీ పరిశ్రమ నుండి భారీ చిత్రాలు రిలీజ్ కి వస్తాయి. భారీ చిత్రాలు లేకపోయినప్పటికీ, మీడియం రేంజ్ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్ల కి రప్పిస్తాయి. వేసవి సెలవులు ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ సభ్యులతో సమయం గడిపేందుకు ఎక్కువగా సినిమాలని ఎంచుకుంటారు. కానీ ఈ ఏడాది అలా జరగలేదు. టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్ లో చేరి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన చివరి చిత్రం. ఈ రేంజ్ బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫాం చేసిన చిత్రం మరొకటి టాలీవుడ్ లో రిలీజ్ కాలేదు.

సినిమాలు లేకపోవడం తో 10 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడే పరిస్థితి వచ్చింది. బడా చిత్రాలు వాయిదా పడటం అందుకు కారణం అని చెప్పాలి. ఈ ఏడాది రిలీజ్ కి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ, సమ్మర్ ను మాత్రం పూర్తిగా ఉపయోగించుకోలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, హరోం హర, గం గం గణేశా లాంటి చిత్రాలు ఈ మే 31 కి రిలీజ్ కానున్నాయి. ఇక బాక్సాఫీస్ కింగ్ కల్కి (Kalki 2898AD) జూన్ 27 న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు