చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో 100 సార్లు రక్తదానం చేసిన ప్రముఖ నటుడు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో 100 సార్లు రక్తదానం చేసిన ప్రముఖ నటుడు

Published on Apr 18, 2024 10:53 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగానే కాకుండా ఓ వ్యక్తిగా కూడా కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. తనకి ఎంతో ప్రేమని ఫేమ్ ని అందించిన తెలుగు ప్రేక్షకులకి తన వంతుగా ఏమైనా చేయాలి అనే ఆలోచన నుంచి పుట్టిన మహత్తర కార్యాలలో తన బ్లడ్ బ్యాంకు కూడా ఒకటి.

మరి ఈ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరో ప్రాణాలు కాపాడిన వారు అయ్యారు చిరు మరియు తన అభిమానులు. తన అభిమానులు, ఆప్తులే రక్త దాతలుగా ఇప్పటివరకు కొనసాగిన ఈ బ్లడ్ బ్యాంకులో ఇప్పటివరకు 100 సార్లు తన రక్తాన్ని దానం చేసి అరుదైన ఘనత ప్రముఖ నటుడు మహర్షి రాఘవ సొంతం చేసుకోవడం విశేషం.

మరి 1998 లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు మొదలు పెడితే అప్పుడు మొట్టమొదటిగా ప్రముఖ నటులు మురళీ మోహన్ రక్తదానం చేస్తే రెండో వ్యక్తిగా మహర్షి రాఘవ మొదలు పెట్టారు. అక్కడ మొదలుకొని ఇప్పుడు వరకు 100 సార్లు రక్తదానం చేసిన మొదటి వ్యక్తిగా రికార్డు అందుకున్నారు. దీనితో చిరంజీవి మహర్షి రాఘవకి ప్రత్యేకంగా సత్కారం చేశారు. దీనితో ఈ వీడియో విజువల్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు