పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ “కల్కి” లో నట కిరీటి..

పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ “కల్కి” లో నట కిరీటి..

Published on Mar 1, 2024 9:01 AM IST

ప్రస్తుతం భారీ అంచనాలు నడుమ తెరకెక్కుతున్న అవైటెడ్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి మరి ఈ చిత్రాన్ని ఫాంటసీ మరియు సై ఫై జానర్ లో తెరకెక్కిస్తుండగా ఇండియా వైడ్ గా కూడా ఎంతోమంది అగ్ర తారల సమ్మేళనంగా కల్కి అయితే పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతుంది.

మరి ఇప్పటికే ఎంతో మంది లెజెండరీ నటులు వర్క్ చేస్తున్న ఈ చిత్రంలో మరో ప్రముఖ నటుడు కూడా పని చేస్తున్నట్టుగా ఇపుడు ఖరారు అయ్యింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నట్టుగా తానే స్వయంగా రివీల్ చేశారు.

దీనితో ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు అంటే చాలా మంచి పాత్రే తప్పకుండా అయ్యి ఉంటుంది అని చెప్పాలి. మరి తనని నాగ్ అశ్విన్ ఎలా ఆవిష్కరించాడో వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ మే 9న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు