ఓ స్పోర్ట్స్ డ్రామా రాస్తున్న ప్రముఖ రైటర్.!

Published on May 26, 2020 10:25 pm IST

మన టాలీవుడ్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమాలను తెరకెక్కించే దర్శకులలో త్రినాథరావు నక్కిన కూడా ఒకరు. అతను తీసిన నేను లోకల్, హలొ గురు ప్రేమ కోసమే లాంటి చిత్రాలకు రచయితగా పని చేసిన ప్రసన్న కుమార్ ఇప్పుడు మరిన్ని సినిమాలలో బిజీగా ఉన్నారు.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రసన్న కుమార్ ఒక స్పోర్ట్స్ డ్రామా రాస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత బజ్ ప్రకారం అర్జున అవార్డు గ్రహీత ప్రముఖ వాలీ బాల్ ప్లేయర్ అరికపూడి రామారావు జీవితంపై రాస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ లాక్ డౌన్ లో స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత ఈ కథతో పలువురు నిర్మాతలను కలవనున్నారు. ప్రస్తుతం రవితేజ మరియు త్రినాథరావు నక్కినలతో చేయనున్న ఓ ప్రాజెక్ట్ కు పని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More