టాలీవుడ్ లో షూటింగ్స్ ఈ డేట్ నుంచే?

Published on May 29, 2020 2:39 am IST

లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అందుకే సినిమానే నమ్ముకుని ఉన్న ఎందరో కార్మికులను ఆదుకోడానికి మరలా షూటింగ్స్ ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతూ మెగాస్టార్ చిరంజీవి మరియు ఇతర టాప్ నిర్మాతలు మరియు దర్శకులు తెలంగాణా సీఎం కెసిఆర్ ను కలిశారు.

వారితో జరిపిన ఈ కీలక చర్చ అనంతరం పలు ఆంక్షలతో షూటింగులు జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ఏ తేదీ నుంచి మొదలు అవుతాయి అన్నది వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఓ డేట్ వినిపిస్తుంది. మన టాలీవుడ్ లోని చిత్రాలు వచ్చే జూన్ 15నుంచి నుంచి మొదలు కానున్నాయట. అలాగే ఓ టాప్ హీరో సినిమా షూటింగ్ తోనే ఇది ఆరంభం కానుంది అని మరో వెర్షన్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More