నాని సినిమాకు టాలీవుడ్ స్టార్స్ ప్రశంసలు

Bhale-Bhale-Magadivoy
‘భలే భలే మగాడివోయ్’.. హీరో నాని, దర్శకుడు మారుతిల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా. గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి కొత్తగా లాంచ్ అయిన గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంది. ఇక అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా వేగవంతం అయ్యాయి. హీరో నాని, దర్శకుడు మారుతి, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలతో పాటు సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపేస్తోంది.

ఇక ఈ సందర్భంగానే నిర్మాత బన్నీ వాస్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భలే భలే మగాడివోయ్ సినిమాను వేర్వేరుగా చూసిన రెబెల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారని, సినిమా ఎంటర్‌టైనింగ్‌గా అందరినీ ఆకట్టుకునేలా ఉందనే అభిప్రాయాన్ని ప్రభాస్, బన్నీ వ్యక్తం చేసినట్లు బన్నీ వాస్ తెలిపారు. చిన్న చిన్న విషయాలను మరచిపోయే ఓ విచిత్ర వ్యాధితో బాధపడే యువకుడి పాత్ర ద్వారా నాని నవ్వుల పువ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్నారు. గీపీ సుందర్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Exit mobile version