భారతీరాజా మృతిపై టాలీవుడ్ సెలబ్రిటీల నివాళి..!

భారతీరాజా మృతిపై టాలీవుడ్ సెలబ్రిటీల నివాళి..!

Published on Jun 10, 2026 11:31 PM IST

Bharathiraja

ప్రముఖ తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా జూన్ 10(బుధవారం) రోజున 84 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. క్లాసిక్ చిత్రాలను రక్తి కట్టించడంలో భారతీరాజా స్పెషలిస్ట్. తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించిన ఘనత ఆయన సొంతం.

ఇక భారతీరాజా మృతి పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ విచారం వ్యక్తం చేశారు. ఇటు టాలీవుడ్ నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్, అల్లు అర్జున్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తదితరులు భారతీరాజా మృతిపై తమ సంతాపం వ్యక్తం చేశారు. భారతీరాజా మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని వారు విచారం తెలిపారు.

భారతీరాజా మృతిపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి విజయ్ స్వయంగా వెళ్లి నివాళి అర్పించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు