బన్నీ ప్లానింగ్‌కు దూరమవుతున్న టాలీవడ్ డైరెక్టర్స్..?

బన్నీ ప్లానింగ్‌కు దూరమవుతున్న టాలీవడ్ డైరెక్టర్స్..?

Published on Aug 17, 2026 4:03 PM IST

Allu-Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, 2027లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత ఇప్పటికే ప్రకటించిన లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌ను బన్నీ పట్టాలెక్కించనున్నాడు. చిన్న విరామం అనంతరం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని ఎలాంటి బ్రేక్‌లు లేకుండా స్పీడ్ షెడ్యూల్స్‌లో పూర్తి చేసి, 2027లోనే థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాల అనంతరం బాసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా రావడం ఖాయమైంది. ఇలా వరుసగా ఇతర భాషల దర్శకులతోనే సినిమాలు చేస్తుండటంతో బన్నీ 2028 చివరి వరకు బిజీగా మారిపోయాడు.

ఈ కారణంతోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్లెవరూ ప్రస్తుతం ఆయనకు కథలు చెప్పేందుకు ముందుకు రావడం లేదు. బన్నీ వేసుకున్న ఈ భారీ ప్లాన్స్ వల్ల తెలుగు దర్శకులు కొన్నాళ్ల పాటు ఆయనకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

తాజా వార్తలు