నాసా స్పేస్ సెంటర్ లో టాలీవుడ్ యువ హీరోలు…!

నాసా స్పేస్ సెంటర్ లో టాలీవుడ్ యువ హీరోలు…!

Published on Oct 13, 2019 10:34 PM IST

Tolly

టాలీవుడ్ యంగ్ హీరోలైన సందీప్ కిషన్, నిఖిల్ మరో నటుడు ఆదర్శ్ అమెరికాలోని నాసా(నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ను సందర్శించారు. ఓ ట్రిప్ లో భాగంగా అమెరికా వెళ్లిన ఈ యువ నటులు వాషింగ్టన్ డీసీ నందు కల నాసా ను సందర్శిచడంతో పాటు, అక్కడ తాము దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు .ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ అయిన నాసాకు అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది.

సందీప్ కిషన్, హన్సిక మోత్వానీ జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, ఏ1 ఎక్స్ ప్రెస్ టైటిల్ తో తెరకెక్కనున్న హాకీ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామాలో ఆయన నటించనున్నారు. సిద్దార్థ నటించిన అర్జున్ సురవరం మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. దీనితో ఈ యంగ్ హీరో మరో చిత్రాలపై దృష్టి సారించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు