గ్రాండ్ మెగా ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ కి రెడీ అయిన టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ

గ్రాండ్ మెగా ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ కి రెడీ అయిన టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ

Published on Apr 12, 2024 8:02 PM IST

టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఇప్పటికే పలువురు నటులతో అనేక సక్సెస్ఫుల్ సినిమాలు చేసారు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ తో ది రాజా సాబ్, అడివి శేష్ గూఢచారి 2 వంటి క్రేజీ ప్రాజక్ట్స్ ని కలిగి ఉన్న ఈ సంస్థ నుండి రేపు సాయంత్రం 5 గం. 4 ని. లకు ఒక భారీ మెగా అడ్వెంచర్ ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ రానుంది.

ఈ విషయమై మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఒక పోస్ట్ చేసారు. కాగా ఇది మెగాస్టార్ చిరంజీవి న్యూ మూవీ అనౌన్స్ మెంట్ అని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు