కరోనా బారినపడ్డ హాలీవుడ్ స్టార్ నటుడు

Published on Mar 12, 2020 8:08 am IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వేల మందికి ఈ వైరస్ ఎఫెక్ట్ కాగా వారిలో సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ కరోనా బారినపడ్డారు. ఆయనతోపాటు ఆయన సతీమణి రీటా విల్సన్ కు సైతం కరోనా వైరస్ సోకింది. వివరాల్లోకి వెళితే టామ్ హాంక్స్, రీటా విల్సన్ ఇద్దరూ వార్నర్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.

ఈ సమయంలోనే వారికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘నేను, రీటా ఆస్ట్రేలియాలో కరోనాకు గురయ్యాం. కొంత నీరసం, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటంతో వైద్యులను సంప్రదించాం. పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. కనుక వైద్యుల పర్యవేక్షణలో ఉండి, వారి సూచనల్ని పాటించాలి. ఎప్పటికప్పుడు మా విషయాల్ని పోస్ట్ చేస్తుంటాం. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు టామ్ హాంక్స్.

సినిమా క్రూలోని సభ్యుల్లో కొందరికి కరోనా ఉండటం మూలంగానే టామ్ హాంక్స్, ఆయన భార్యకు కూడా వైరస్ సోకినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న టామ్ హాంక్స్ అభిమానులు ఆయన, ఆయన భార్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More