రేపే సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ సెన్సార్

రేపే సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ సెన్సార్

Published on Nov 7, 2014 11:01 AM IST

Pilla-Nuvvu-Leni-Jeevitham
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కావడానికి సిద్దమైన మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న ఈ చిత్ర టీం సినిమా బాగా వచ్చిందని చాలా సతోషంగా ఉన్నారు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రేపు అనగా నవంబర్ 8న సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది. రేపు సాయంత్రం కల్లా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ డీటైల్స్ వచ్చేస్తాయి. సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు