మాస్ మహారాజా కొత్త సినిమాపై రేపు స్పెష‌ల్ అప్డేట్.!

Published on Jun 30, 2021 8:08 pm IST


మాస్ మహారాజా రవితేజ కొత్త డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌తో తన 68వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో మ‌జిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే జూలై 1 నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నున్న సందర్భంగా మేకర్స్ ర‌వితేజ అభిమానుల‌కు ఓ స‌ర్‌ప్రైజ్ కానుక అందించాల‌ని ప్లాన్ చేశారు.

అందులో భాగంగానే రేపు ఉద‌యం 10:08 గంట‌లకు ఈ కొత్త సినిమాకు సంబంధించి స్పెష‌ల్ అప్డేట్‌ను ప్ర‌క‌టించ‌బోతున్నారు. సినిమా తారాగ‌ణం మరియు విడుద‌ల తేదీల‌పై అప్డేట్ ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. ఇదిలాఉంటే కోలీవుడ్ కంపోజ‌ర్‌ సామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం రవితేజ ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :