బన్నీ త్రివిక్రమ్ ల అలవైకుంఠపురంలో మూవీ ప్రమోషన్స్ విషయంలో దూసుకుపోతున్నారు. స్ట్రాటెజిక్ గా ఒక్కొక్క పాట విడుదల చేస్తూ మూవీపై భారీ బజ్ క్రియేట్ చేశారు. వీటికి మించిన సర్ప్రైజ్ టీజర్ తో ఫ్యాన్స్ కి ఇవ్వనున్నారు. ఐతే టీజర్ విడుదల తేదీ నేడు ప్రకటించాల్సివుండగా మెగా ఫ్యామిలీ చిరకాల మిత్రుడు, అభిమాని అయిన నూర్ మొహ్మద్ హఠాన్మరణం వలన పోస్ట్ ఫోన్ చేశారు. కాగా అలవైకుంఠపురంలో మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కొద్దిసేపటి క్రితం ఓ ట్వీట్ చేయడం జరిగింది . దాని ప్రకారం రేపు ఉందయం 10గంటలకు టీజర్ పై అప్డేట్ ఇవ్వడంతో పాటు, సాయంత్రం ఓ సర్ప్రైజ్ కూడా ఇవ్వనున్నామని ప్రకటించడం జరిగింది.
దీనితో అలవైకుంఠపురంలో టీజర్ సర్ప్రైజింగ్ గా రేపే విడుదల చేయనున్నారా, అని అనుమానం కలుగుతుంది. లేదా రేపు సాయంత్రం అలవైకుంఠపురంలో మూవీకి సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్ ఇస్తారా అనేది చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్, నివేద పేతురాజ్ ఇతర కీలకపాత్రలలో కనిపిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా 2020జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
#AlaVaikunthapurramulooTeaser update will be posted at 10:00AM in the Morning followed by a surprise for all the Stylish Star @alluarjun fans Tomorrow Evening!! #Trivikram @hegdepooja @MusicThaman #Tabu #Jayaram #NivethaPethuraj @iamSushanthA @pnavdeep26 @Mee_Sunil #PSVinod
— Haarika & Hassine Creations (@haarikahassine) December 8, 2019


