సౌత్ లో రజనికి పోటీ ప్రభాసే, ఇదే నిదర్శనం

సౌత్ లో రజనికి పోటీ ప్రభాసే, ఇదే నిదర్శనం

Published on Sep 3, 2019 11:47 AM IST

సూపర్ స్టార్ రజిని కాంత్ భారీ చిత్రాలకు భారీ వసూళ్లకు పెట్టింది పేరు. ఆయన చిత్రాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంటుంది. రజిని చిత్రం అంటే మాస్ లో ఉండే క్రేజే వేరు. ఆయనని స్టైల్ కి ఐకాన్ గా చెప్పుకుంటారు అందరు. మరి ఆ స్థాయి హీరో సౌత్ నుండి ఎవరున్నారు అంటే అది ప్రభాస్ అనడంలో సందేహం లేదు. అందుకు వారు నటించిన భారీ చిత్రాలు, వాటి లెక్కలే నిదర్శనం.

సౌత్ నుండి భారీ వసూళ్లు సాధించిన టాప్ 5 చిత్రాలలో వీరిద్దరి చిత్రాలే పోటీపడుతున్నాయి. బాహుబలి 2 అత్యధిక వసూళ్ళతో ఎవరికీ అందనంత ఎత్తులో మొదటి స్థానంలో ఉండగా, తరువాత రజిని 2.0 రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో బాహుబలి ఉండగా, కొత్తగా సాహో ఈ లిస్టులో నాలుగవ స్థానంలో వచ్చి చేరింది. ఇక కబాలి చిత్రం టాప్ ఫైవ్ లోఆఖరి స్థానంలో నిలిచింది. ఈ విధంగా రజని మరియు ప్రభాస్ చిత్రాలు పోటీపడుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు