విజయశాంతి తో సినిమా చేసేందుకు సిద్ధంగా వున్నఅగ్ర నిర్మాతలు!

Vijayashanti

అలనాటిం టాప్ హీరోయిన్ విజయశాంతి తో సినిమా చేసేందుకు నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల తరువాత సరిలేరు నీకెవ్వరూ చిత్రం తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు వెండితెర మీదికి మళ్ళీ వస్తున్నారు. ఈ చిత్రంలో విజయశాంతి ప్రొఫెసర్ భారతి పాత్రలో కనిపించనున్నారు. విజయశాంతి అభిమానులు, సినీ ప్రేమికులు విజయశాంతిని వెండితెర మీద చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే విజయశాంతి గారు చిత్రాల్లో రీ ఎంట్రీ ఇవ్వడంతో దర్శక నిర్మాతలు తనతో సినిమాలు చేసేందుకు, డేట్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. అయితే విజయశాంతి గారు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మంచి పత్రాలు వస్తే భవిష్యత్ లో నటించేందుకు ఆలోచిస్తానని తెలపడంతో చిత్ర నిర్మాతలు మంచి కథతో తన వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

Exit mobile version