టాప్ ప్రొడ్యూసర్ చేతికి ‘బాహుబలి’ కర్ణాటక రైట్స్!

Baahubali-pposter
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. యావత్ దేశం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఇన్ని అంచనాల మధ్య విడుదల కానున్న సినిమా ‘బాహుబలి’యే! మొదట్నుంచీ బడ్జెట్ విషయంలో, గ్రాండ్‌నెస్ విషయంలో, బిజినెస్ విషయంలో మంచి ఆసక్తి కలిగిస్తూ వస్తున్న ఈ సినిమా తాజాగా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

రాజమౌళి సన్నిహితుడైన సాయి కొర్రపాటి బాహుబలి కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను పొందారు. బాహుబలి అన్ని వర్షన్‌లనూ ఆయనే కర్ణాటకలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేయగా, ఆడియో ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 10న భారీ ఎత్తున విడుదల కానుంది.

Exit mobile version