దిల్ రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

pawan-kalyan1
ఒక డిస్ట్రిబ్యూటర్ గా సినీ ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి నిర్మాతగా చేసిన మొదటి సినిమా ‘దిల్’నే తన ఇంటి పేరుగా మార్చుకున్న నిర్మాత దిల్ రాజు. నిర్మాతగా అన్ని డిపార్ట్ మెంట్స్ మీద పట్టుండాలి, కథా బలం ఉన్న సినిమాలకే ఆదరణ ఎక్కువ ఉంటుంది అని నమ్మి సినిమాలు చేసే దిల్ రాజు నేటితరం నిర్మాతలకు ఓ గైడ్ లాంటివాడు. దిల్ రాజు నిర్మాతగా కొత్త వారితో చిన్న చిన్న సినిమాలు చేస్తూనే, మరోవైపు స్టార్ హీరోలతో కూడా కంటిన్యూగా బిగ్ బడ్జెట్ మూవీస్ నిర్మిస్తున్నారు. దాదాపు ఇండస్ట్రీలోని అందరు యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దిల్ రాజు చాలా రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చెయ్యాలని కలలుకంటున్నాడు, ఆ కల త్వరలోనే నెరవేరనుంది.

ఇక విషయంలోకి నిన్న సాయంత్రం జరిగిన సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆడియో లాంచ్ లో దిల్ రాజు మాట్లాడుతూ ‘చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చెయ్యాలనుకుంటున్నాను. ఆయన కొద్ది రోజుల క్రితమే మా బ్యానర్ లో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ తో పాటు డేట్స్ కూడా ఇచ్చాడు. ఇక నేను ఆయనకి తగ్గా కథ మరియు దర్శకుడిని వెతకాలి. ఆయన లానే చిరంజీవి గారితో కూడా ఓ సినిమా చేయాలని ఉందని’ తెలిపాడు. దీంతో దిల్ రాజు పవన్ కళ్యాణ్ కోసం ఏ స్టార్ రైటర్ మరియు డైరెక్టర్ ని రంగంలోకి దింపుతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే దిల్ రాజు ప్రస్తుతం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘కృష్ణాష్టమి’ సినిమాలను రిలీజ్ చేసే పనిలో బిజీ గా ఉన్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సర్దార్ తర్వాత చేసే మరో సినిమా కమిట్ కాలేదు కావున దిల్ రాజు సినిమానే మొదలు పెడతాడని సమాచారం.

Exit mobile version