పోటా పోటీగా ‘రంగస్థలం, భరత్ అనే నేను’ !

పోటా పోటీగా ‘రంగస్థలం, భరత్ అనే నేను’ !

Published on May 13, 2018 1:21 AM IST

రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం’, మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రాలు 20 రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ముందుగా రిలీజైన ‘రంగస్థలం’ మొదటి షో నుండే భారీ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సినిమాకు లాంగ్ రన్ వసూళ్ళు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో చిత్రం ఇప్పటికే వరకు 3.5 మిలియన్లను రాబట్టి ఇంకా కొన్ని చోట్ల నడుస్తూనే ఉంది.

ఈ రన్ ఇంకొద్ధి రోజుల్లో పూర్తికానుంది. మరోవైపు ‘భరత్ అనే నేను’ కూడా భారీ స్థాయిలో విడుదలవడంతో ప్రీమియర్ల ద్వారా పెద్ద మొత్తంలో రాబట్టి మంచి రన్ కనబర్చి ఇప్పటి వరకు 3.37 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఈ చిత్రం కూడ ఇంకా కొన్నాళ్ళు నడిచే అవకాశముంది. ఇలా రెండు సినిమాలు పోటా పోటీగా నడుస్తుండంతో ఫుల్ రన్ ముగిసేసరికి ఏ చిత్రం ముందంజలో ఉంటుందో చూడాలనే ఆసక్తి అందరిలోను నెలకొంది.

తాజా వార్తలు