కొద్దిరోజుల క్రితం వరకు ఖైదీగా సందడి చేసిన కార్తీ మరో రెండు రోజులలో దొంగ గా వస్తున్నాడు. దర్శకుడు జీతూ జోసెఫ్ దొంగ చిత్రాన్ని ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారని సమాచారం. దొంగ చిత్రంలో కార్తీ దొంగగా, అక్క ను కాపాడే తమ్ముడిగా రెండు భిన్నమైన రోల్స్ నందు కనిపించనున్నాడు. ఐతే దొంగ సినిమా విపరీతమైన పోటీ మధ్య విడుదల అవుతుంది. డిసెంబర్ 20న విడుదల అవుతున్న ఈ చిత్రానికి పోటీగా బాలకృష్ణ రూలర్, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండుగే చిత్రాలు విడుదల అవుతున్నాయి. వీటితో పాటు సల్మాన్ నటించిన దబాంగ్ 3 కూడా విడుదల కావడం విశేషం.
కాబట్టి కార్తీ దొంగ ఈ మూడు భారీ చిత్రాల నుండి తీవ్ర పోటీ ఎదుర్కొవాల్సిన పరిస్థితి. కార్తీ ఖైదీ అక్టోబర్ 25న దీపావళి కానుకగా విడుదలైంది. ఈ చిత్రానికి పోటీగా మరో తమిళ భారీ చిత్రం విజిల్ విడుదల కావడం జరిగింది. ఐతే ఈ రెండు చిత్రాలు తెలుగులో పోటీ లేకుండా విడుదలై సక్సెస్ సాధించాయి. కానీ కార్తీ దొంగ విషయంలో నెలకొన్న పోటీ రీత్యా ఈ చిత్రం అధిక థియేటర్స్ దక్కించుకోలేక పోవచ్చు. దీని వలన టాక్ పాజిటివ్ గా వచ్చిన ఓపెనింగ్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దొంగ కి గడ్డుకాలమే అని తెలుస్తుంది.
