మూడూ మూడే.. టఫ్ ఫైట్ ఖాయం

Published on Mar 9, 2021 3:00 am IST

గత రెండు మూడు వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడి బాగా పెరిగింది. గత వారం, ఆ ముందు వారం కలిపి 13కు పైగా చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అలాగే ఈ వారం కూడ బాక్సాఫీస్ ఫైట్ గట్టిగానే ఉండనుంది. ఈ గురువారం 11వ తేదీన మహాశివరాత్రి సెలవు కావడంతో మూడు చిత్రాలు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకుని విడుదలకానున్నాయి. అవే ‘గాలి సంపత్, జాతిరత్నాలు, శ్రీకారం’. ఈ మూడు సినిమాలకు మంచి పాజిటివ్ బజ్ ఉంది. ట్రైలర్లు, పాటలతో మూడు సినిమాలు బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాయి.

వీటిలో బిజినెస్ పరంగా చూస్తే శర్వానంద్ ‘శ్రీకారం’ ముందంజలో ఉండగా బజ్ పరంగా ‘జాతిరత్నాలు, గాలిసంపత్’ కూడ గట్టిగానే ఉన్నాయి. మూడూ మూడు డిఫరెంట్ జానర్ సినిమాలు కావడంతో ప్రేక్షకులకు ఛాయిస్ దొరికినట్లైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోరుకునేవారికి ‘శ్రీకారం’, కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ ఆశించేవారికి ‘జాతిరత్నాలు’, ఎమోషనల్ కంటెంట్ కోరుకునేవారికి ‘గాలిసంపత్’. అయితే బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే మాత్రం ఏ సినిమాకైతే మొదటిరోజు మంచి పాజిటివ్ టాక్ దొరుకుతుందో లాంగ్ వీకెండ్ ఆ సినిమాకే అధికంగా కలిసొచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :