ఫైనల్ కొరకు కఠినమైన పరీక్షలు పెడుతున్న బిగ్ బాస్

ఫైనల్ కొరకు కఠినమైన పరీక్షలు పెడుతున్న బిగ్ బాస్

Published on Oct 23, 2019 10:08 PM IST

బిగ్ బాస్ షో కేవలం ఇంకొద్ది రోజులలో ముగియనుంది. దీనితో ఎలాగైనా ఫైనల్ కి చేరేందుకు కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తున్నారు. ఐతే మొదటి నుండి ఎటువంటి అంచనాలు లేని రాహుల్ టికెట్ టు ఫినాలే అవకాశం దక్కించుకొని ఫైనల్ కి బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఇక మిగిలిన ఐదుగురు ఇంటిసభ్యులైన శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, శివ జ్యోతి, అలీ రెజా ఫైనల్ కి చేరుకోవడానికి చెమటోడవాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా ఈ ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని, మిగిలిన వారు ఫైనల్ కి పోటీపడతారని తెలుస్తుంది.

ఐతే ఫైనల్ కొరకు బిగ్ బాస్ వీరికి సపరేటుగా కఠిన టాస్క్ లు ఇచ్చారు. ఆడవారైనా శ్రీముఖి, శివజ్యోతికి శారీరక శ్రమలేని జుగుప్సా కరమైన టాస్కులు ఇవ్వగా, మేల్ కంటెస్టెంట్స్ అయిన వరుణ్, అలీ రెజా, బాబా భాస్కర్ లకు శారీరక శ్రమతో కూడిన ఫిజికల్ టాస్క్ లు ఇచ్చారు. ఎలాగైనా ఫైనల్ కి చేరుకోవాలని ఈ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు నేడు విడుదల చేసిన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు