చైతు కోసం విషాదాంతమైన ప్రేమ కథ !
Published on Jan 11, 2019 8:00 pm IST

స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అక్కినేని నాగ చైతన్య కోసం ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ స్క్రిప్ట్ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ పాత ‘దేవదాస్’ కథ ఆధారంగా అంతటి గొప్ప విషాదాంతమైన ప్రేమ కథను చైతు కోసం రాశాడట.

కాగా ఈ కథ చైతు కెరీర్ లోనే గొప్పగా నిలిచిపోతుందని ఈ స్టార్ రైటర్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుక పడిన చైతూకి ఎలాగైన ఓ మంచి స్క్రిప్ట్ అందివ్వాలనే ఉద్దేశ్యంతోనే విజయేంద్ర ప్రసాద్ ఈ స్క్రిప్ట్ రాసారట.

ప్రస్తుతం నాగ చైతన్య శివ నిర్వాణ దర్శకత్వంలో తన సతీమణి సమంతతో కలిసి ‘మజిలీ’ చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook