మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఒక్కడు’ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసినదే. ఈ రీమేక్ యొక్క ట్రైలర్ నిన్న విడుదల చేసారు. బాలీవుడ్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్న అర్జున్ కపూర్ ని యాక్షన్ మోడ్ లో చూసిన ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
మహేష్ బాబు పాత్రను అర్జున్ కపూర్ పోషించారు. భూమిక స్థానాన్ని సోనాక్షి సిన్హా భర్తీ చేయనుంది. ఆగ్రా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రను మనోజ్ భాజ్ పై నటిస్తున్నారు. అమిత్ శర్మ దర్శకుడు. బోనీ కపూర్ నిర్మాత. తేవర్ వచ్చే నెల 5న విడుదలకానుంది


