ట్రైలర్ తో వచ్చిన ‘వాల్మీకి’ !

Published on Sep 9, 2019 4:38 pm IST

వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘వాల్మీకి’. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రైలర్ లో వరుణ్ తేజ్ గెటప్ అండ్ డైలాగ్స్‌ బాగున్నాయి. అలాగే ఎంటర్‌టైన్‌ చేసే సన్నివేశాల తాలూకు షాట్స్, మరియు ఆకట్టుకునే సిట్యుయేషన్స్‌ ఈ ట్రైలర్‌ లో బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో కూడా గ్యాంగ్‌ స్టర్‌ గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపిస్తున్నాడు.

అలాగే హరీష్ శంకర్ రాసిన కామెడీ కూడా సినిమాలో హైలెట్ అవుతుందట. ఈ సినిమాను సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

X
More